పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఉన్నట్లు బిహార్లోనూ అధిక సంఖ్యలో మండీలు ఉండాలని బిహార్ రైతులు డిమాండ్ చేస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తెలిపారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
'మార్కెట్లను పెంచి రైతులను కాపాడండి ' - priyanka gandhi on airports lease
కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. రైతులు మార్కెట్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తూ వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులను నష్టాల్లోకి నెట్టివేస్తాయని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా సైతం కేంద్రం లక్ష్యంగా ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు. ప్రజలకు దీపావళి కానుకగా ఆర్థిక మాంద్యం ఇచ్చి.. బడా వ్యాపారస్థులకు ఆరు విమానాశ్రయాలను ఇచ్చారని తెలిపారు. లఖ్నవూ విమానాశ్రయాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారని వివరించారు.