వాస్తవాధీన రేఖ వెంబడి చైనా మరోసారి దూకుడు ప్రదర్శించిన నేపథ్యంలో మోదీ సర్కార్ లక్ష్యంగా ఘాటు విమర్శలు చేసింది కాంగ్రెస్. ప్రతి రోజు చైనా సైన్యం భారత్లోకి చొరబాటు ప్రయత్నాలు చేస్తోందని విమర్శించింది. చైనాపై ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు కన్నెర్రజేస్తారని ప్రశ్నించింది.
"పాంగాంగ్ సో సరస్సు వద్ద చైనా సైన్యం మరోసారి దుందుడుకు చర్యకు దిగింది. పాంగాంగ్ సో, గోగ్రా, గల్వాన్ లోయ, దెస్పంగ్, లిపులేఖ్, దోకా లా, నకులా పాస్ ప్రాంతాల్లో నిత్యం చైనా చొరబాట్లకు పాల్పడుతోంది. మన భద్రతా దళాలు భరతమాతను రక్షించేందుకు ధైర్యంగా నిలబడుతున్నాయి. కానీ, మోదీ కన్నెర్రజేసేది ఎప్పుడు?"
-రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి