వర్చువల్ విధానం ద్వారా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది కాంగ్రెస్. దేశంలో చర్చించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయని.. వాటిల్లో భారత్-చైనా సరిహద్దు వివాదం అతి ముఖ్యమైనదని తెలిపింది.
ఈ సందర్భంగా 1962 యుద్ధ సమయంలోనూ అప్పటి భాజపా నేత అటల్ బిహారీ వాజ్‌పేయి పార్లమెంట్ సమావేశాలను జరపాలని డిమాండ్ చేసినట్లు గుర్తుచేశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవాన్ ఖేరా. ఆయన డిమాండ్‌ను స్వాగతిస్తూ నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సమావేశాలను నిర్వహించినట్లు స్పష్టం చేశారు.
"ముఖ్యమైన అంశాలపై చర్చించటానికి పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. చర్చించాల్సిన అంశాలు ఎన్నో ఉన్నప్పటికీ పార్లమెంటరీ కమిటీలు కూడా సమావేశం కావటం లేదు" అని పవన్ ఖేరా అభిప్రాయపడ్డారు.