భారత్-చైనా సరిహద్దులో తాజా పరిస్థితులపై స్పందించిన కాంగ్రెస్.. జవాన్ల మృతిపై విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటన ఆమోదనీయం కాదని అని నొక్కిచెప్పింది.
'ఈ ఘటన నమ్మలేనిది, ఒప్పుకోదగనిది, ఆమోదయోగ్యం కానిది. ఈ ఘటనను రక్షణ మంత్రి ధృవీకరిస్తారా?' అని ఆ పార్టీ అధికార ప్రతినిధి... రణదీప్ సుర్జేవాలా ట్విట్టర్లో పేర్కొన్నారు.
సరిహద్దు పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు ఆనంద్ శర్మ. రాజకీయ పార్టీలతో అత్యవసరంగా సమావేశమై.. సరిహద్దు క్షేత్రస్థాయి పరిస్థితులపై వివరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.