రాజీవ్ గాంధీ ఫౌండేషన్ విరాళాలపై భాజపా చేసిన విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. పీఎం కేర్స్‌కు చైనా సంస్థల నుంచి విరాళాలు అందుతున్నాయని.. సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ వాటిని ఎందుకు స్వీకరిస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీసింది.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరేళ్లలో 18సార్లు ఎందుకు కలిశారని కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ ప్రశ్నించారు. సరిహద్దులో ఇంత ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ... చైనా తీరును మోదీ ఎందుకు తప్పుపట్టడం లేదని అడిగారు.
"పీఎం కేర్స్ ద్వారా చైనా సంస్థల నుంచి ప్రధానికి భారీ మొత్తంలో విరాళాలు అందుతున్నాయి. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. మోదీ తన వ్యాఖ్యలపై తాను నిలబడకుండా.. చైనా సంస్థల నుంచి వందల కోట్లను స్వీకరిస్తే.. ఇక చైనా దుశ్చర్యల నుంచి దేశాన్ని ఎలా రక్షిస్తారు?"
--- అభిషేక్ సింఘ్వీ, కాంగ్రెస్ సీనియర్ నేత.