తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్​ ఓటమిపై 'గ్రామస్థాయి'లో సమీక్ష - ఉత్తరప్రదేశ్

సార్వత్రిక ఎన్నికల్లో అమేఠీ నుంచి పోటీ చేసిన రాహుల్​ గాంధీ ఓటమి పాలవడంపై కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నుంచి సమీక్షలు నిర్వహిస్తోంది.

రాహుల్​ ఓటమిపై 'గ్రామస్థాయి'లో సమీక్ష

By

Published : Jun 1, 2019, 5:30 PM IST

ఉత్తరప్రదేశ్​లోని 'గాంధీల కంచుకోట' అమేఠీలో.. పార్టీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ఓటమిపాలవడంపై కాంగ్రెస్ సమీక్ష నిర్వహిస్తోంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాజకీయ వ్యవహారాలు పర్యవేక్షించే జుబిర్​ఖాన్​, యూపీఏ ఛైర్​పర్సన్ సోనియా గాంధీ అధికార ప్రతినిధి కిషోర్​లాల్​ శర్మ... ఈ పనిలో నిమగ్నమయ్యారు. గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ సమీక్షలో రాహుల్​గాంధీ ఓటమికి గల కారణాలపై విశ్లేషణ చేసుకున్నారు.

"సమీక్ష గ్రామస్థాయిలో కూడా జరుగుతోంది. సమీక్ష బృంద సభ్యులు... మండలం, పంచాయతీ స్థాయి నేతలతోనూ సమావేశాలు నిర్వహిస్తారు."
- రాజీవ్​ సింగ్​, యూపీ కాంగ్రెస్​ కమిటీ సభ్యుడు

చరిత్ర సృష్టించిన స్మృతి..

కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​గాంధీపై 55,120 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. రాహుల్ ఓటమికి బాధ్యత వహిస్తూ, అమేఠీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు యోగీంద్ర మిశ్రా రాజీనామా చేశారు.

ఇదీ చూడండి: 'దేశ భద్రత, ప్రజా సంక్షేమానికే తొలి ప్రాధాన్యం'

ABOUT THE AUTHOR

...view details