తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార్లమెంట్ సంయుక్త సమావేశం బహిష్కరించిన విపక్షాలు - రాజ్యాంగాన్ని స్వయంగా చదివి వినిపించిన సోనియా గాంధీ

మహారాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో విపక్ష పార్టీలు మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశాయి. పార్లమెంట్​ సంయుక్త సమావేశాన్ని బహిష్కరించాయి. అంబేడ్కర్​ విగ్రహం ముందు రాజ్యాంగ ప్రతులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా ఇందుకు నేతృత్వం వహించారు.

Cong resolves to save 'soul' of the Constitution
పార్లమెంట్ సంయుక్త సమావేశం బహిష్కరించిన విపక్షాలు

By

Published : Nov 26, 2019, 1:15 PM IST

Updated : Nov 26, 2019, 2:34 PM IST

పార్లమెంట్ సంయుక్త సమావేశం బహిష్కరించిన విపక్షాలు

అధికార వాంఛతో నిరంకుశ పాలన సాగిస్తున్న ప్రభుత్వం నుంచి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడతామని విపక్షాలు ప్రతినబూనాయి. మహారాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో భాజపాపై ఈమేరకు తీవ్ర విమర్శలు గుప్పిస్తూ నిరసనబాట పట్టాయి.

'మహా'రాజకీయంపై నిరసన

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్​లో నిర్వహించిన కార్యక్రమాన్ని విపక్షాలు బహిష్కరించాయి. అంబేడ్కర్​ విగ్రహం ముందు ఉమ్మడిగా ఆందోళన చేపట్టాయి. ఈ నిరసనలో కాంగ్రెస్, డీఎంకే, ఎన్​సీపీ, ఆర్​జేడీ, సీపీఐ, పీపీఎం, ఐయూఎమ్​ఎల్​, శివసేన నేతలు పాల్గొన్నారు.

సోనియా నేతృత్వంలో..

రాజ్యాంగ దినోత్సవాన్ని బహిష్కరించాలన్న కాంగ్రెస్ నిర్ణయానికి మొదటగా శివసేన మద్దతు పలికింది. ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వం వహించారు. రాజ్యాంగం పీఠికను స్వయంగా చదివి వినిపించారు. రాజ్యాంగంలోని ప్రాథమిక విలువలకు కట్టుబడి ఉండాలని సంకల్పించారు.
ప్రియాంక ట్వీట్​

ప్రియాంక ట్వీట్​

"ధనబలం, మందబలాన్ని ఎదుర్కొనేందుకు.. రాజ్యాంగం ముందు తల వంచితే సరిపోదు. రాజ్యాంగ విలువలను కాపాడుకునేందుకు గట్టిగా నిలుస్తామని ప్రతిజ్ఞ చేయాలి. జై రాజ్యాంగం, జై హింద్​."
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

ఇదీ చూడండి: భారత దేశ ప్రజలమైన మేము...

Last Updated : Nov 26, 2019, 2:34 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details