తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నోట్ల రద్దు సమయంలో దోపిడీపై కాంగ్రెస్ వీడియో

నోట్ల రద్దు సమయంలో భాజపా నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఒక  వీడియోను అధారంగా చూపింది కాంగ్రెస్​.  అప్పట్లో అహ్మదాబాద్​లో జరిగిన స్టింగ్​ ఆపరేషన్ దృశ్యాలను మీడియా ముందు ప్రదర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్​.

By

Published : Mar 26, 2019, 8:51 PM IST

నోట్ల రద్దు సమయంలో దోపిడీపై కాంగ్రెస్ వీడియో

నోట్లరద్దు సమయంలో అహ్మదాబాద్​లోని ఓ భాజపా నేత 40 శాతం కమిషన్​ తీసుకుని నగదు మార్పిడీ చేశారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్. దీనికి సంబంధించిన 30 నిమిషాల నిడివి గల వీడియోను మీడియా ముందు ప్రదర్శించారు.

మీడియాకు వివరిస్తున్న కపిల్ సిబల్​

"అక్కడ జరిగిన లావాదేవి ఏంటంటే... రూ.5కోట్ల విలువ చేసే పాత 500ల నోట్లిస్తే వాటికి బదులుగా 3కోట్లకు సరిపడా కొత్త 2వేల నోట్లను ఇచ్చారు. సంప్రదింపులు ఒక హోటల్​లో జరిగాయి. 40 శాతం కమిషన్ ఎక్కువని ఎదుటి వ్యక్తి అడిగితే తనపైనున్న కీలక వ్యక్తులకే ఎక్కువ చెల్లించాలని చెప్పారు. ఈ సంఘటన 2016 డిసెంబరు 31 తర్వాత జరిగింది.. అప్పటికి నోట్ల మార్పిడి లేదు. రూ.2వేల నోట్ల కట్టలు వారికి ఎక్కడి నుంచి వచ్చాయి. ఎవరు తీసుకొచ్చారు. ఏ బ్యాంకు నుంచి వచ్చాయి. అవి రిజర్వు బ్యాంకు డబ్బు అయితే వాటిని దొంగిలించిందెవరు. దొంగ ఎవరు? కాపలాదారు ఎవరు? దేశ భక్తులెవరు? దేశ ద్రోహులెవరు? ప్రజలకు తెలియాలి"
-కపిల్ సిబల్​, కాంగ్రెస్​ సీనియర్ నేత

నోట్ల రద్దు సమయంలో దేశ వ్యాప్తంగా భాజపా నేతలంతా ఇదే తరహా అక్రమాలకు పాల్పడ్డారని సిబల్​ ఆరోపించారు. ప్రజాధనాన్ని దోచుకొని పార్టీకి నిధులు సమకూర్చారని అన్నారు.

మీడియా సమావేశంలో ప్రదర్శించిన వీడియోను ధ్రువీకరించేందుకు నిరాకరించారు సిబల్. ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకే తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వివరాలు బహిర్గతం అయినందు వల్ల ఎవరైనా నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నించవచ్చని సూచించారు.

దిల్లీలో కాంగ్రెస్​ నిర్వహించిన ఈ మీడియా సమావేశానికి కాంగ్రెస్​ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్ సహాతెదేపా,ఆర్​జేడీ, ఎల్​జేడీ, నేషనల్ కాన్ఫరెన్స్​ నేతలు హాజరయ్యారు.

జైట్లీ ఖండన

కాంగ్రెస్ నేతలు చూపుతున్న వీడియో నకిలీదన్నారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. యూపీఏ తప్పుడు ప్రచారాలకు ఇది కొనసాగింపు అని వ్యాఖ్యానించారు.

లండన్​లో ఈవీఎంల ట్యాంపరింగ్​పై మీడియా సమావేశం, కర్ణాటకలో యడ్యూరప్ప ఫేక్ డైరీ సృష్టితో కాంగ్రెస్​ అసత్య ప్రచారాలు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు జైట్లీ.

ABOUT THE AUTHOR

...view details