కర్ణాటకలోని చిత్రదుర్గలో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి పర్యటనపై కాంగ్రెస్ అనుమానాలను లేవనెత్తింది. నరేంద్రమోదీ వచ్చిన హెలికాప్టర్ నుంచి తరలించిన నల్లపెట్టెలో ఏముందో చెప్పాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. ఇలాంటి విషయాల్లో ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ కోరారు.
"చిత్రదుర్గలో ప్రధానమంత్రి హెలికాప్టర్ నుంచి ఓ పెద్ద నల్లపెట్టెను దించారు. ఈ పెట్టెను ప్రధాని వాహన శ్రేణిలో లేని ఓ ప్రైవేట్ వాహనంలో పెట్టారు. వెంటనే అక్కడ నుంచి వేగంగా ఆ కారు వెళ్లిపోయింది. ఈ విషయం మా దృష్టికి వచ్చింది. ఆ దృశ్యాలు మాకు చూపించారు. కర్ణాటక పార్టీ అధ్యక్షుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై నిజానిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది."