వివాదాలకు దారి తీసిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఇవి రైతు వ్యతిరేక చట్టాలని ఆరోపించింది. అన్ని రాష్ట్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించింది.
దిల్లీలో జరిగిన పార్టీ ప్రధానకార్యదర్శులు, రాష్ట్ర ఇన్ఛార్జుల సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ సూచనలకు అనుగుణంగా ఈ భేటీ నిర్వహించారు. సమావేశం అనంతరం పార్టీ నేతలు ఈ విషయంపై మాట్లాడారు.
గవర్నర్లకు వినతి పత్రం..
వచ్చే 3 రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా మీడియా సమావేశాలు నిర్వహిస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా తెలిపారు. సెప్టెంబర్ 28న ర్యాలీగా వెళ్లి గవర్నర్లకు వినతి పత్రం అందజేస్తామని స్పష్టం చేశారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తామన్నారు.
"రైతుల గళాన్ని వినిపించేందుకు అక్టోబర్ 10న కిసాన్ సమ్మేళన్ నిర్వహిస్తాం. అక్టోబర్ 2-31 వరకు దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది రైతుల సంతకాలను సేకరిస్తాం. ఈ సంతకాలతో వినతి పత్రాన్ని నవంబర్ 14న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందజేస్తాం."
- రణ్‌దీప్ సుర్జేవాలా