మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సే దేశభక్తుడంటూ వ్యాఖ్యలు చేసిన భాజపా ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌పై కాంగ్రెస్ పార్టీ చర్యలకు సిద్ధమైంది. ఆమెను పార్లమెంట్‌నుంచి బహిష్కరించే ఉద్దేశంతో సెన్సూర్ మోషన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించడానికి కాంగ్రెస్ ఎంపీలతో పాటు, మిత్రపక్షాలైన డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ పార్టీల సభ్యుల సంతకాలను తీసుకున్నట్లు సమాచారం.
లోక్‌సభ వేదికగా జాతిపిత మహాత్మా గాంధీని అవమానించినందుకు ప్రగ్యా సింగ్ ఠాకూర్‌పై సెన్సూర్ తీర్మానానికి సభ ప్రతిపాదించింది. సదరు సభ్యురాలిని సభలో నుంచి తప్పుకోవాలని కోరుతున్నాం. తిరిగి సభలోకి చేర్చుకునే ముందు అధికారికంగా క్షమాపణలు చెప్పాలి.
-యూపీఏ ప్రతిపాదిత తీర్మానం.