కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాలని పంజాబ్ కాంగ్రెస్ ఎంపీలు లోక్సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టనున్నారు. 'రిపీలింగ్ అండ్ అమెండ్మెంట్ బిల్ 2021' పేరిట ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ తెలిపారు. తనతోపాటు ప్రణీత్ కౌర్, జస్బీర్ సింగ్ గిల్, సంతోఖ్ చౌదరి సహా పలువురు పార్టీ ఎంపీలు కలిసి దీన్ని ప్రతిపాదించనున్నట్లు వెల్లడించారు.
రైతుల పట్ల సానుభూతితో ఉన్న ఇతర పార్టీల ఎంపీలను ఈ బిల్లుకు మద్దతివ్వాలని కోరనున్నట్లు తెలిపారు తివారీ. రాజ్యసభలోనూ ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టాలని తమ పార్టీకి చెందిన సభ్యులను అభ్యర్థిస్తామని చెప్పారు.