తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​ ఎమ్మెల్యే ఇంటికి నిప్పు.. ఘర్షణలో ముగ్గురు మృతి - karnataka mla news

కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటికి నిప్పు పెట్టారు దుండగులు. ఆయన బంధువు ఫేస్​బుక్​లో చేసిన పోస్టు అభ్యంతరకరంగా ఉందని విధ్వంసం సృష్టించారు. అనంతరం ఎమ్మెల్యే బందువుని అరెస్టు చేయాలని పోలీస్​ స్టేషన్​ వద్ద హింసాత్మక ఆందోళనలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 100 మంది పోలీసులు గాయపడ్డారు.

Cong MLA Srinivas Murthy's house vandalised by miscreants over social media post
కాంగ్రెస్​ ఎమ్మెల్యే ఇంటికి నిప్పు.. ఘర్షణలో ఇద్దరు మృతి

By

Published : Aug 12, 2020, 5:14 AM IST

Updated : Aug 12, 2020, 7:58 AM IST

కర్ణాటక బెంగళూరులోని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి నివాసంపై మంగళవారం అర్ధరాత్రి దాడి చేశారు దుండగులు. ఇంటికి నిప్పుపెట్టి విధ్వంసం సృష్టించారు. ఎమ్మెల్యే మేనల్లుడు ఫేస్​బుక్​లో చేసిన ఓ పోస్టు తమ మనోభావాలను కించపరిచేలా ఉందని ఓ వర్గం ఆందోళనకారులు ఈ చర్యలకు పాల్పడ్డారు. అనంతరం కేజీ హల్లి, డీజే హల్లి పోలీస్ స్టేషన్​లకు గుంపులుగా వెళ్లి.. ఎమ్మెల్యే బందువును అరెస్టు చేయాలని మతపరమైన నినాదాలు చేశారు. పలు వాహనాలకు నిప్పుపెట్టి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు.

ఘర్షణ...

ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్​ చేశారు. వారిపై నిరసనకారులు ప్రతిఘటించడంతో తీవ్ర ఘర్షణ చెలరేగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 10 మందికిపైగా గాయపడ్డారు.

ఈ ఘర్షణలో ఏసీపీ సహా దాదాపు 100 మంది పోలీసులు గాయపడినట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్​ పంత్​ తెలిపారు. అల్లర్లతో సంబంధమున్న 110 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. బెంగళూరులో 144 సెక్షన్​, కేజీ హళ్లి, డీజే హళ్లి పోలీస్​ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు.

విజ్ఞప్తి చేసినా..

బెంగళూరులోని పులికేసి నగర్​ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు శ్రీనివాస మూర్తి. హింసాత్మక ఘటనలకు పాల్పడొద్దని ఆందోళనకారులను ఫేస్​బుక్​లో వీడియో ద్వారా ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది.

విధ్వంసం సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్​ బొమ్మాయి స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు.

Last Updated : Aug 12, 2020, 7:58 AM IST

ABOUT THE AUTHOR

...view details