తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ భేరి: విజయం కోసం కాంగ్రెస్​ 'పంచతంత్రం' - ఎన్నికల ప్రణాళిక

ఉద్యోగాలు, రైతు శ్రేయస్సు, పేదలకు న్యాయమే ప్రధానాంశాలుగా ఎన్నికల ప్రణాళిక విడుదల చేసింది కాంగ్రెస్. పేదలకు ఏటా రూ.72వేల సాయం, రైతులకు ప్రత్యేక బడ్జెట్, 22లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి హామీలు పొందుపరిచింది.

కాంగ్రెస్​ ఎన్నికల ప్రణాళిక విడుదల

By

Published : Apr 2, 2019, 4:24 PM IST

Updated : Apr 2, 2019, 7:30 PM IST

విజయం కోసం కాంగ్రెస్​ 'పంచతంత్రం'
సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పంచతంత్ర వ్యూహంతో కాంగ్రెస్​ ఎన్నికల ప్రణాళిక విడుదల చేసింది. ఇప్పటికే ప్రకటించిన కనీస ఆదాయ పథకం సహా మరికొన్ని కీలక హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

"మేము చేసి చూపిస్తాం" అనే శీర్షికతో రూపొందించిన 55 పేజీల మేనిఫెస్టోను కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ విడుదల చేశారు. దిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్​, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరయ్యారు.

పేదలు, యువత, రైతుల ఓట్లే ప్రధాన లక్ష్యంగా మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను రాహుల్​ వివరించారు.

"మేనిఫెస్టోలో 5 ప్రధాన అంశాలున్నాయి. మొట్టమొదటి అంశం 'న్యాయ్'. పేదలకు ఏటా రూ.72 వేలు ఇస్తాం. రెండో అంశం నరేంద్రమోదీ పాలనలో జీఎస్టీ, నోట్లరద్దు ద్వారా స్తబ్దుగా మారిన ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తాం. 22లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 2020 మార్చి నాటికి వాటిని భర్తీ చేస్తాం. ఔత్సాహిక యువత పరిశ్రమల స్థాపనకు మూడేళ్ల పాటు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. గ్రామీణ ఉపాధి హామీ ద్వారా 150 రోజులు పని కల్పిస్తాం. రైతుల కోసం రెండు పెద్ద అంశాల్ని ఆలోచించాం... ఒకటి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్. రైతులు రుణాలు చెల్లించకపోవడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణిస్తున్నారు. వాటిని సివిల్ కేసులుగా పరిగణిస్తాం."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు

జీఎస్టీని గబ్బర్​ సింగ్​ ట్యాక్స్​గా అభివర్ణిస్తూ మరోమారు ప్రధాని నరేంద్రమోదీపై ధ్వజమెత్తారు రాహుల్​. ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ, మెహుల్​ చోక్సీ, లలిత్ మోదీ వ్యవహారాలపై మోదీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ప్రధానికి ధైర్యముంటే అవినీతి, దేశ భద్రతపై తనతో ఐదు నిమిషాలు చర్చకు రావాలని సవాల్ విసిరారు రాహుల్​.

Last Updated : Apr 2, 2019, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details