తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశ విచ్ఛిన్నమే కాంగ్రెస్​ లక్ష్యం: జైట్లీ

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను దేశ విచ్ఛిన్నమే లక్ష్యంగా రూపొందించారని ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ మండిపడ్డారు. ప్రణాళికలో కొన్ని అంశాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

దేశ విచ్ఛిన్నమే కాంగ్రెస్​ ప్రణాళిక లక్ష్యం:జైట్లీ

By

Published : Apr 2, 2019, 8:14 PM IST

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ అమలుకు సాధ్యంకాని హామీలను పొందుపరిచిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఐదు రాష్ట్రాల్లో రుణమాఫీ ఇంకా అమలుకు నోచుకోలేదన్నారు జైట్లీ.

దేశ భద్రత అంశంలో కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిందని జైట్లీ తీవ్రంగా మండిపడ్డారు. జమ్ముకశ్మీర్​కు సంబంధించి కాంగ్రెస్ డ్రాఫ్టింగ్​ కమిటీ పొందుపరిచిన అంశాల్లో రాహుల్​ గాంధీ సన్నిహితులు సూచించిన విషయాలున్నాయని ఆరోపించారు.

మీడియాతో మాట్లాడుతున్న అరుణ్​ జైట్లీ

"మేనిఫెస్టోలో ఉన్న హమీలను రాహుల్ నెరవేర్చుతారని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. కొన్ని ఆలోచనలు చాలా ప్రమాదకరం. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే అజెండాతోనే మేనిఫెస్టో రూపొందించారు. చట్టాలపై సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. దేశ భద్రతకు సంబంధించి ఎలాంటి అంశాలు పొందుపరిచారు? ఐపీసీ సెక్షన్ 124-ఏను ఉపసంహరిస్తామంటున్నారు, ఇక నుంచి దేశద్రోహానికి పాల్పడితే నేరం కాదు. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న పార్టీకి దేశంలో ఒక్క ఓటు పొందే హక్కు లేదు."
-అరుణ్ జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి

ఇదీ చూడండి:కాంగ్రెస్​ మేనిఫెస్టో... 15 కీలక హామీలు

ABOUT THE AUTHOR

...view details