తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈవీఎంలు ఉంటే ట్రంప్​ గెలిచేవారేమో: కాంగ్రెస్​

బిహార్​ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈవీఎంల విశ్వసనీయతపై మరోసారి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్​ సీనియర్​ నేత ఉదిత్​ రాజ్​ ఈవీఎంల పనితీరుపై స్పందించారు. వాటిని కూడా హ్యాక్​ చేసే ప్రమాదం ఉన్నట్లు తెలిపారు.

http://10.10.50.80:6060//finalout3/odisha-nle/thumbnail/10-November-2020/9500192_535_9500192_1605007961227.png
ఈవీఎంలు ఉంటే ట్రంప్​ గెలిచేవారేమో

By

Published : Nov 10, 2020, 5:13 PM IST

Updated : Nov 10, 2020, 5:57 PM IST

కాంగ్రెస్​ అధికార ప్రతినిధి ఉదిత్​ రాజ్​ ఈవీఎంల పని తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. వాటిని హ్యాక్​ చేసే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. బిహార్​ ఎన్నికల ఫలితాల్లో భాజపా ఆధిక్యంలో కొనసాగుతుండగా ఆయన చేసిన ట్వీట్లు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

"అంతరిక్షంలో ఉండే ఉపగ్రహాలనే నేలపై నుంచి నియంత్రిస్తుంటే ఈవీఎంలను హ్యాక్​ చేయలేమా?" అని ట్వీట్​ చేశారు. వీటిని ఉపయోగించి ఉంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​ ఓడిపోయేవారా? అని ప్రశ్నించారు.

ఎగ్జిట్ ​పోల్స్​ అంచనాలను తారుమారు చేస్తూ భాజపా ఆధిక్యంలో కొనసాగుతుండడం తెలిసిందే.

ఇదీ చూడండి: బిహార్​ తీర్పు: అటు ఆనందం- ఇటు అసంతృప్తి

Last Updated : Nov 10, 2020, 5:57 PM IST

ABOUT THE AUTHOR

...view details