కర్ణాటక అధికార కూటమిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది భాజపా. ఇనుప ఖనిజం తవ్వేందుకు జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సంస్థకు బళ్లారిలో 3667 ఎకరాల భూములను చవకగా అమ్మడంలో అధికార కూటమికి ముడుపులు ముట్టాయని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్ నేత యడ్యూరప్ప ఆరోపించారు. ఇనుప ఖనిజం భూములను జేఎస్‌డబ్ల్యూకు అమ్మటాన్ని నిరసిస్తూ మూడు రోజుల పాటు బెంగళూరులో నిరసనలు చేపట్టనున్నామని ప్రకటించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనట్లయితే రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగుతామని హెచ్చరించారు.
'బళ్లారి భూ అమ్మకాల్లో అధికార కూటమికి ముడుపులు' - భాజపా సీనియర్ నేత యడ్యూరప్ప
కర్ణాటకలోని అధికార కాంగ్రెస్-జేడీఎస్ కూటమిపై భాజపా సీనియర్ నేత యడ్యూరప్ప తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు బళ్లారిలో ఇనుప ఖనిజం భూములను చవకగా అమ్మడంలో అధికార కూటమికి ముడుపులు అందాయని ఆరోపించారు కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప.
'బళ్లారి భూఅమ్మకాల్లో అధికార కూటమికి ముడుపులు'
తాము ఇనుప ఖనిజ గనులను కొనుగోలు చేయడంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్న జేఎస్‌డబ్ల్యూ అధినేత సజ్జన్ జిందాల్ వ్యాఖ్యల నేపథ్యంలో యడ్యూరప్ప ఈ ప్రకటన చేశారు. బళ్లారిలోని ఇనుప ఖనిజం ఉన్న భూముల లీజును రద్దు చేస్తూ తక్కువ ధరకు అమ్మేందుకే కర్ణాటక కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఎడ్డీ ఆరోపించారు.
ఇదీ చూడండి: సుఖోయ్ యుద్ధ విమానాల్లో బ్రహ్మోస్