కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్ కూలి కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్. ప్రస్తుతం వారి స్థానాల్లో ఉప ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో గురువారం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) భేటీ అయ్యింది. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ప్రతి నియోజకవర్గానికి సీనియర్ నాయకుడి నేతృత్వంలో బృందాన్ని నియమించాలని నిర్ణయించారు. నియోజకవర్గాల ఇంఛార్జ్‌లను శుక్రవారం ప్రకటించనుంది పార్టీ.
"17 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్ని ఏ విధంగా ఎదుర్కోవాలో చర్చించేందుకు భేటీ అయ్యాం. ప్రతిఒక్క నియోజకవర్గానికి సీనియర్ నాయకుడి అధ్యక్షతన బృందాన్ని ఏర్పాటు చేయనున్నాం. వారు తక్షణమే వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటిస్తారు."
- దినేష్ గుండూరావు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు
జేడీఎస్‌తో పొత్తు...