తెలంగాణ

telangana

ETV Bharat / bharat

40వేల కోట్ల 'మహా' డ్రామాపై రాజకీయ దుమారం - మహారాష్ట్ర వార్తలు

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడా సంఖ్యాబలం లేదని తెలిసినా భాజపా ఎందుకు అధికారం చేపట్టింది? 'దేవేంద్ర 2.0' కథ 80 గంటల్లోనే ఎందుకు ముగిసింది? ఆ కొద్ది సమయంలోనే తెరవెనుక ఏం జరిగింది? ఈ ప్రశ్నలకు భాజపా ఎంపీ అనంత కుమార్ హెగ్డే ఇచ్చిన సమాధానం సర్వత్రా చర్చనీయాంశమైంది. రాజకీయ దుమారం రేపింది. ఈ వ్యవహారంపై ప్రధాని సమాధానమివ్వాలని డిమాండ్​ చేసింది కాంగ్రెస్​. అయితే... హెగ్డే వ్యాఖ్యలను తోసిపుచ్చారు ఫడణవీస్​.

Hegde
40వేల కోట్ల 'మహా' డ్రామాపై రాజకీయ దుమారం

By

Published : Dec 2, 2019, 2:35 PM IST

Updated : Dec 2, 2019, 4:04 PM IST

40వేల కోట్ల 'మహా' డ్రామాపై రాజకీయ దుమారం

మహారాష్ట్రలో దేవేంద్ర ఫడణవీస్​ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టటంపై కీలక వ్యాఖ్యలు చేశారు భాజపా ఎంపీ అనంత కుమార్​ హెగ్డే. ప్రభుత్వానికి కావాల్సిన మెజారిటీ లేదని తెలిసినా.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టటం వెనుక ఓ పెద్ద కథ ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి అధీనంలోని రూ.40వేల కోట్లను కాపాడేందుకు ఈ నాటకం ఆడినట్లు వివరించారు.

కర్ణాటక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు అనంత కుమార్​.

"మీ అందరికీ తెలుసు మా పార్టీ నేత ఫడణవీస్​ మహారాష్ట్రలో కేవలం 80 గంటలే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన రాజీనామా చేశారు.
ఈ డ్రామా మేము ఎందుకు చేశామని అనుకుంటున్నారా? రూ.40వేల కోట్లకుపైగా నిధులు ముఖ్యమంత్రి అధీనంలో ఉన్నాయి. ఒకవేళ ఎన్సీపీ, కాంగ్రెస్​, శివసేన కూటమి అధికారంలోకి వస్తే ఆ నగదును అభివృద్ధి కోసం ఖర్చు చేయదు. ఇతర వాటి కోసం వినియోగిస్తుంది. అందుకే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాలని ముందుగానే ప్రణాళిక రూపొందించాం. ఈ డ్రామా అమలు చేశాం. అన్ని విధాలా సర్దుబాట్లు జరిగాయి. ఫడణవీస్​ సీఎంగా ప్రమాణం చేశారు. 15 గంటల్లోనే ఆ రూ. 40వేల కోట్లు ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చారు. "

- అనంత కుమార్​ హెగ్డే, భాజపా ఎంపీ

'మహా' డ్రామాపై ప్రధాని సమాధానం చెప్పాలి: కాంగ్రెస్​

అనంతకుమార్​ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది కాంగ్రెస్​. మహారాష్ట్రపై భాజపాకు ఉన్న వ్యతిరేకతను ఆ పార్టీ ఎంపీ వెల్లబుచ్చారని పేర్కొంది. ప్రజలు, రైతుల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను కుట్ర పూరితంగా వెనక్కి తీసుకున్నారా? అని ప్రశ్నించారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా. దీనిపై ప్రధానమంత్రి సమాధానం ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

తప్పుడు ప్రకటన: ఫడణవీస్​

అనంతకుమార్​ వ్యాఖ్యలను తోసిపుచ్చారు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్. ఆయన చేసింది పూర్తిగా తప్పుడు ప్రకటన అని కొట్టిపారేశారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు అడగలేదు, మహారాష్ట్ర ప్రభుత్వం ఏ నిధులను తిరిగి పంపలేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: దిశ: 'నిబంధనలు కఠినతరం చేసేందుకు కేంద్రం సిద్ధం!

Last Updated : Dec 2, 2019, 4:04 PM IST

ABOUT THE AUTHOR

...view details