తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహా పోరు: ఆరే కాలనీ, పీఎంసీ బ్యాంకులే కాంగ్రెస్​ అస్త్రాలు! - మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్​ అండ్​ మహారాష్ట్ర కోఆపరేటివ్​ బ్యాంకు కుంభకోణం, ఆరే కాలనీ వృక్షాల తొలగింపును అస్త్రాలుగా చేసుకోవాలనుకుంటోంది కాంగ్రెస్​. ఎన్నికల ప్రచారాల్లో ఈ సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపిచ్చింది.

ఆరే కాలనీ, పీఎంసీ బ్యాంకు సమస్యలే కాంగ్రెస్​ అస్త్రాలు!

By

Published : Oct 6, 2019, 5:12 AM IST

Updated : Oct 6, 2019, 5:58 AM IST

మహా పోరు: ఆరే కాలనీ, పీఎంసీ బ్యాంకులే కాంగ్రెస్​ అస్త్రాలు!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్నకొద్దీ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ప్రధాన సమస్యలైన పంజాబ్​ అండ్​ మహారాష్ట్ర కోఆపరేటివ్​ (పీఎంసీ) బ్యాంకు కుంభకోణం, ఆరే కాలనీ వృక్షాల తొలగింపును ఎన్నికల అస్త్రాలుగా చేసుకోవాలని చూస్తోంది కాంగ్రెస్​. ప్రచారాల్లో ప్రధానంగా వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధి పొందాలనుకుంటోంది. కాంగ్రెస్​ పార్టీ ముంబయి నగర అధ్యక్షుడు ఏక్​నాథ్​ గైక్వాడ్​ వ్యాఖ్యలతో ఈ విషయం స్పష్టమవుతోంది.

పలు కీలక సమస్యలతో ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు గైక్వాడ్.

" గుంతల రోడ్లు, పంజాబ్​ అండ్​ మహారాష్ట్ర కోఆపరేటివ్​ బ్యాంకు కుంభకోణం, మెట్రో కార్​ షెడ్​ కోసం ఆరే కాలనీలో వృక్షాల తొలగింపు వంటి సమస్యలపై ముంబయి ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు."

- ఏక్​నాథ్​ గైక్వాడ్​, కాంగ్రెస్​ పార్టీ ముంబయి నగర అధ్యక్షుడు.

బుజ్జగింపులు..

టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కాంగ్రెస్​ నాయకుడు సంజయ్​ నిరుపమ్​తో సహా పార్టీపై గుర్రుగా ఉన్న నాయకులను బుజ్జగించే పనిలోపడింది ఆ పార్టీ నాయకత్వం. పార్టీపై నెలకొన్న అపార్థాలను తొలగించుకునేందుకు నిరుపమ్​ ఏఐసీసీ ప్రధానకార్యదర్శి మల్లికార్జున​ ఖర్గే, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవాలని సూచించారు గైక్వాడ్​.

తమ విధేయులకు టికెట్​ రాకుండా రాహుల్​ గాంధీకి సన్నిహితంగా ఉన్న నాయకులు కుట్ర పన్నారని నిరుపమ్​ ఆరోపించిన మరుసటి రోజునే ఈ వ్యాఖ్యలు చేశారు గైక్వాడ్​. పార్టీ మాజీ నాయకురాలు ఊర్మిళ మతోండ్కర్​​, నిరుపమ్​ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారనే నమ్మకం ఉందని తెలిపారు.

అక్టోబర్​ 21న ఎన్నికలు..

288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో ఈనెల 21న ఎన్నికలు జరగనున్నాయి. 24న ఫలితాల విడుదలవుతాయి.

ఇదీ చూడండి:మహా పోరు: కాంగ్రెస్ ప్రచారంలో సోనియా, మన్మోహన్

Last Updated : Oct 6, 2019, 5:58 AM IST

ABOUT THE AUTHOR

...view details