తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రామమందిర వివాదం ముగింపు కాంగ్రెస్​కు ఇష్టంలేదు' - యోగి ఆదిత్యనాథ్ వార్తలు

బాబ్రీ-రామజన్మభూమి వివాదం ముగింపును కాంగ్రెస్​ కోరుకోవటం లేదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ ఆరోపించారు. అధికారం కోసం ప్రజల మనోభావాలతో రాజకీయం చేయటం ఆ పార్టీకి పరిపాటి అని విమర్శించారు.

Adityanath
ఆదిత్యనాథ్​

By

Published : Aug 3, 2020, 10:01 PM IST

అయోధ్య రామమందిరం విషయంలో కాంగ్రెస్​పై విరుచుకుపడ్డారు ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. బాబ్రీ మసీదు- రామజన్మభూమి వివాదం ముగింపు పలకటం కాంగ్రెస్​కు ఇష్టం లేదని విమర్శించారు.

అయోధ్యలో భూమిపూజ ఏర్పాట్లను పరిశీలించిన యోగి.. కాంగ్రెస్​ లక్ష్యంగా విమర్శలు సంధించారు. స్వాతంత్య్రం అనంతరం రామమందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ చేపట్టాల్సిందని అభిప్రాయపడ్డారు.

"దేశానికన్నా వారికి అధికారంలో ఉండటమే ముఖ్యం. అందుకే ప్రజల మనోభావాలతో రాజకీయం చేశారు. ఈ వివాదం ముగింపును వాళ్లు కోరుకోవటం లేదు. కానీ, నకిలీ లౌకికవాదం, కుల, మత రాజకీయాలకు ముగింపు తప్పనిసరి."

- యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం

రామమందిరానికి ఆగస్టు 5న ప్రధాని నరేంద్రమోదీ భూమిపూజ చేస్తారని, ఇది ప్రజలందిరికీ చారిత్రక ఘటనగా మిగిలిపోతుందని యోగి అన్నారు. ఇది నవభారత నిర్మాణానికి పునాది అని అభివర్ణించారు.

డిగ్గీ వ్యాఖ్యలు అసంబద్ధం..

భూమిపూజ ముహూర్తంపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ సారథి ఆలోక్ కుమార్​ ఖండించారు. కార్యక్రమానికి ముందు భాజపా నేతలకు కరోనా సోకటం అపశకునమని చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమని అన్నారు.

"దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు అసంబద్ధం. నేను వార్తాపత్రికల్లో చూశా. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఆసుపత్రిలో చేరారు. కాబట్టి ఆయన ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం లేదు."

- ఆలోక్ కుమార్, వీహెచ్​పీ వర్కింగ్ ప్రెసిడెంట్​

ఇదీ చూడండి:'అయోధ్య భూమిపూజకు ఇవి మంచి సంకేతాలు కావు'

ABOUT THE AUTHOR

...view details