తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"ప్రజ్ఞాసింగ్​ వ్యాఖ్యలపై ప్రధాని క్షమాపణలు చెప్పాలి"

గాడ్సేను దేశభక్తుడంటూ భాజపా భోపాల్ లోక్​సభ అభ్యర్థి సాధ్వీ ప్రజ్ఞాసింగ్​ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి తెరతీశాయి. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బేషరతుగా క్షమాపణలు చెప్పి ప్రజ్ఞాసింగ్​పై కఠిన చర్యలు తీసుకోవాలని​ కాంగ్రెస్​ పార్టీ డిమాండ్​ చేసింది. ఈ వ్యవహారంలో భాజపా ఎందుకు మౌనంగా ఉండిపోయిందని ప్రశ్నించింది ఆమ్​ఆద్మీ పార్టీ.

"ప్రజ్ఞాసింగ్​ వ్యాఖ్యలపై ప్రధాని క్షమాపణలు చెప్పాలి"

By

Published : May 17, 2019, 5:47 AM IST

Updated : May 17, 2019, 7:17 AM IST

"ప్రజ్ఞాసింగ్​ వ్యాఖ్యలపై ప్రధాని క్షమాపణలు చెప్పాలి"
జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరామ్‌ గాడ్సే 'గొప్ప దేశభక్తుడు' అని గురువారం భోపాల్‌ భాజపా లోక్‌సభ అభ్యర్థి స్వాధ్వి ప్రజ్ఞాసింగ్‌ కొనియాడారు. ఈ విషయంపై సర్వత్రా విమర్శలు ఎదురవడం వల్ల ఆ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటలకే క్షమాపణలు చెప్పారు సాధ్వి. కానీ అప్పటికే ప్రజ్ఞాసింగ్​ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది.

ప్రధాని క్షమాపణలకు కాంగ్రెస్​ డిమాండ్​

ప్రజ్ఞా వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేసింది కాంగ్రెస్​ పార్టీ. ఆమెపై కఠిన చర్యలు తీసుకుని, భోపాల్​ లోక్​సభ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలంది. అమరవీరులను అవమానించటం భాజపా డీఎన్​ఏలోనే ఉందని ఆరోపించారు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సింగ్​ సుర్జేవాలా.
భాజపా సభ్యులు గాడ్సే వారసులని స్పష్టంగా తెలుస్తోందన్నారు సుర్జేవాలా. గాడ్సేను దేశభక్తుడని, 26/11 ముంబయి ఉగ్రదాడిలో అమరుడు హేమంత్​ కర్కరేను దేశద్రోహిగా చిత్రీకరించటం కాషాయ దళానికే చెల్లిందని విమర్శించారు.

ప్రజ్ఞాపై మీ వైఖరేంటీ?

ఈ విషయంపై కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. బాపుని హత్యచేసిన వ్యక్తి దేశభక్తుడా? అంటూ ట్వీట్​ చేశారు. ప్రజ్ఞాను దూరంపెట్టి చేతులు దులుపుకోకుండా... పూర్తి వ్యవహారంపై తమ వైఖరి ఏమిటో భాజపా స్పష్టంగా తెలపాలని డిమాండ్​ చేశారు.

మౌనం ఎందుకు?

భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించింది ఆమ్​ఆద్మీ పార్టీ. గాడ్సేను ఉద్దేశించి ప్రజ్ఞాసింగ్​ ఠాకూర్​ అనుచిత వ్యాఖ్యలు చేస్తే భాజపా నాయకత్వం ఎందుకు మౌనంగా ఉండిపోయిందని ప్రశ్నించింది. దేశాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి ధ్వంసం చేస్తున్నారని విమర్శించింది. దేశ ప్రజలు ఈ ప్రమాదకర పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలని వెల్లడించింది. పార్టీ నుంచి ప్రజ్ఞాను ఎందుకు బహిష్కరించటం లేదని ప్రశ్నించింది.

ఇదీ చూడండి:క్షమాపణలు చెప్పిన సాధ్వి- నివేదిక కోరిన ఈసీ

Last Updated : May 17, 2019, 7:17 AM IST

ABOUT THE AUTHOR

...view details