తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముఖ్యమంత్రి​ 'కొండ-ఎలుక' వ్యాఖ్యలపై దుమారం - సోనియా గాంధీ

కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియాగాంధీపై తీవ్ర విమర్శలు చేసిన హరియాణా ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసింది హస్తం పార్టీ. సోనియాపై చేసిన వ్యాఖ్యలకు ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.

ముఖ్యమంత్రి​ 'కొండ-ఎలుక' వ్యాఖ్యలపై దుమారం

By

Published : Oct 14, 2019, 2:04 PM IST

హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​లాల్​ ఖట్టర్​పై కాంగ్రెస్​ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్​ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ ఎన్నికపై ఆయన చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. ఖట్టర్ రాజ్యాంగ విరుద్ధంగా సోనియా గాంధీ గురించి మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళా కాంగ్రెస్​ అధ్యక్షురాలు సుష్మితా దేవ్​. మహిళల పట్ల భాజపా పార్టీ, ఖట్టర్​ దృక్పథాన్ని ఈ వ్యాఖ్యలు బయటపెట్టాయని విమర్శించారు.

"ఒక కాంగ్రెస్​ నేతగా ప్రజాజీవితంలో గౌరవప్రదంగా వ్యవహరించేందుకు కట్టుబడి ఉన్నాము. కానీ ఒక మహిళగా... ఖట్టర్​ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇందుకు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేస్తున్నాం."
- సుష్మితా దేవ్​, మహిళా కాంగ్రెస్​ అధ్యక్షురాలు

సోనియాపై ఖట్టర్​ వ్యాఖ్యలు

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ​ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ పార్టీ సారథిగా ఇటీవల మరోమారు బాధ్యతలు స్వీకరించారు సోనియా. అయితే ఆమె ఎన్నికపై ఆదివారం తీవ్ర ఆరోపణలు చేశారు ఖట్టర్​. 'కొండను తవ్వి ఎలుకను పట్టారు' అనే సామెతను ఉపయోగిస్తూ విమర్శించారు.

ఇదీ చూడండి : కశ్మీర్​లో పోస్ట్​పెయిడ్​ మొబైల్​ సేవల పునరుద్ధరణ

ABOUT THE AUTHOR

...view details