తెలంగాణ

telangana

ETV Bharat / bharat

31న ప్రతిపక్షాల భేటీ.. ఓటమిపై విశ్లేషణ - సీపీపీ

లోక్​సభ ఎన్నికల్లో భాజపా చేతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్న ప్రతిపక్షాలు ఈ నెల 31న సమావేశం కానున్నాయి. ఓటమికి గల కారణాలను విశ్లేషించనున్నారు. కాంగ్రెస్​ పార్లమెంటరీ పార్టీ నేతను ఎన్నుకునేందుకు.. జూన్​ 1న సీపీపీ భేటీ కానుంది.

31న ప్రతిపక్షాల భేటీ.. ఓటమిపై విశ్లేషణ

By

Published : May 30, 2019, 5:22 AM IST

31న ప్రతిపక్షాల భేటీ.. ఓటమిపై విశ్లేషణ

సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పాలైన ప్రతిపక్షాలు తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టాయి. ఎన్నికల అనంతరం తొలిసారి మే 31న పార్లమెంటులో సమావేశం కానున్నాయి.

జూన్​ 6 నుంచి ప్రారంభమవుతాయని భావిస్తున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నాయి. ఈ భేటీకి కాంగ్రెస్​ నేతృత్వం వహించనుంది. 17వ లోక్​సభ ఏర్పాటైన అనంతరం విపక్షాలు సమావేశం కానుండటం ఇదే తొలిసారి.

ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారిన ఈవీఎం, వీవీప్యాట్​ స్లిప్పుల మధ్య వ్యత్యాసాలపై విపక్షాలు మరోసారి చర్చించనున్నాయి. రాష్ట్రపతి భవన్​లో మోదీ, ఆయన కేబినెట్​ ప్రమాణస్వీకార మహోత్సవం జరగనున్న మరుసటి రోజే ఈ విపక్షాల సమావేశం జరగనుంది.

కాంగ్రెస్​ పార్లమెంటరీ పార్టీ భేటీ...

పార్లమెంట్​ సెంట్రల్​ హాల్​లో జూన్​ 1న కాంగ్రెస్​ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) భేటీ కానుంది. ఈ సమావేశంలో సీపీపీ తదుపరి వ్యూహాలపై చర్చించనున్నారు. అనంతరం నూతన లోక్​సభాపక్షనేతను ఎన్నుకోనున్నారు కాంగ్రెస్​ ఎంపీలు. కాంగ్రెస్​ అధ్యక్ష పదవికి రాజీనామా ప్రతిపాదన చేసిన అనంతరం రాహుల్​గాంధీ పాల్గొననున్న ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.

మే 25న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్​ అధ్యక్ష పదవికి రాహుల్​ గాంధీ రాజీనామా ప్రతిపాదన చేశారు. అనంతరం.. పార్టీ సీనియర్లు, కార్యకర్తలు, ఇతర పార్టీ నేతలూ రాహుల్​ గాంధీనే అధ్యక్ష పదవిలో కొనసాగాలని గళం వినిపించారు.

ఇదీ చూడండి:

బూతు బొమ్మల కట్టడికి భారత్​కు అమెరికా సాయం

ABOUT THE AUTHOR

...view details