దేశంలోని ప్రస్తుత పరిణామాలు, సమస్యలపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను రూపొందించటానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన 'సలహా కమిటీ' ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఈ కమిటీకి కన్వీనర్‌గా ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా వ్యవహరించనున్నారు.
"మన్మోహన్ సింగ్ అధ్యక్షతన 'సలహా కమిటీ'ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏర్పాటు చేశారు . ఈ కమిటీ దేశంలోని ప్రస్తుత పరిణామాలు, సమస్యలపై పార్టీ అనుసరించాల్సిన విధివిధానాలను రూపొందిస్తుంది."
-కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి
ఈ కమిటీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేంద్ర మాజీ మంత్రులు చిదంబరం, జైరాం రమేశ్‌తో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా కీలక సభ్యులుగా ఉన్నారు.
కరోనా అతిపెద్ద సవాల్...
దేశానికి కరోనా వైరస్ అతి పెద్ద సవాల్‌గా మారిందని అన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ సంక్షోభ సమయంలో పరిష్కార మార్గాలను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, డేటా నిపుణులను సంఘటితం చేయాలని ట్విట్టర్లో సూచించారు. కరోనా వైరస్ నియంత్రణకు లాక్‌డౌన్‌ను విధించటం ఒక్కటే పరిష్కార మార్గం కాదన్నారు రాహుల్.. అధిక సంఖ్యలో వైరస్ పరీక్షలు నిర్వహించటమే ప్రధాన ఆయుధం అని అన్నారు.