తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ, షాపై ఈసీకి కాంగ్రెస్​ ఫిర్యాదు

ఎన్నికల్లో ఓట్లు రాబట్టేందుకు సాయుధ దళాలపై ప్రధాని మోదీ, అమిత్​ షా రాజకీయం చేస్తున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలపై​, ప్రధాని మోదీ వెబ్​ సిరీస్​పైనా ఈసీకి ఫిర్యాదు చేసింది.

By

Published : Apr 13, 2019, 6:45 AM IST

మోదీ, అమిత్​ షాలపై ఈసీకి కాంగ్రెస్​ ఫిర్యాదు

మోదీ, అమిత్​ షాలపై ఈసీకి కాంగ్రెస్​ ఫిర్యాదు

ఎన్నికల్లో ఓట్లు పొందడానికి సాయుధ దళాలపై రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​ షాపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.

అభిషేక్​ సింఘ్వీ, రణ్​దీప్​ సింగ్​ సుర్జేవాలా సహా పలువురు కాంగ్రెస్​ నేతలు ఎన్నికల సంఘాన్ని కలిశారు. అమేఠీ స్థానం నుంచి పోటీచేస్తున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తన విద్యార్హతపై నామినేషన్​లో తప్పుడు సమాచారం అందించారని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హురాలిగా ప్రకటించాలని డిమాండ్​ చేశారు.

" బాలాకోట్​ విషయంలో ప్రధాని మోదీ, అమిత్​ షా, ఇతర భాజపా నేతలు సాయుధ దళాలపై రాజకీయం చేస్తున్నారు. ఇది 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో మొదటి సారి. సైనిక చర్యలను ప్రతిరోజు రాజకీయాల్లోకి లాగుతున్నారు. దీనిపై రాజకీయం చేస్తూ ఓటు అడగడం ప్రధాని మోదీ, అమిత్​ షాలకే సాధ్యం." - అభిషేక్​ మను సింఘ్వీ, కాంగ్రెస్​ ప్రతినిధి

ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించిన వారిని మందలించటమే కాకుండా తగిన చర్యలు చేపట్టి ప్రచారాలలో పాల్గొనకుండా చూడాలని ఈసీకి విజ్ఞప్తి చేసినట్టు కాంగ్రెస్​ నేతలు తెలిపారు. ప్రధాని మోదీ వెబ్​ సిరీస్​నూ నిలిపివేయాలని కోరినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details