కరోనా మహమ్మారిపై పోరులో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు. వైరస్‌పై కట్టిడి చేసేందుకు రాష్ట్రాలకు కేంద్రం నిధులివ్వకపోతే మహమ్మారిపై దేశం ఎలా విజయం సాధిస్తుందని సీడబ్ల్యూసీ సమావేశం వేదికగా ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వాలకు దన్నుగా నిలిచేలా కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్ చేశారు.
"కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం.. అన్ని రాష్ట్రాలకు నిధులను విడుదల చేయాలి. కేంద్రం సరైన ఆర్థిక ప్యాకేజీ ఇవ్వకపోతే లాక్డౌన్ తర్వాత రాష్ట్రాలు సాధారణ పరిస్థితులకు ఎలా చేరుకుంటాయి. రాపిట్ టెస్టు కిట్లు ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తూ అవి విఫలమవుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం నాణ్యతతో కూడిన వెంటిలేటర్లు, కిట్లు ఎంతో అవసరం."
-అశోక్ గహ్లోత్, రాజస్థాన్ ముఖ్యమంత్రి
"జీఎస్టీ ద్వారా వచ్చిన 4,400 కోట్లను కేంద్రం ఇప్పటికీ విడుదల చేయలేదు. రాష్ట్రానికి లక్ష టెస్టింగ్ కిట్లు అవసరం ఉంటే, కేవలం పదివేల చైనా కిట్లను మాత్రమే పంపారు. వాటి ప్రామాణికతను ఇంకా పరీక్షించలేదు"
-అమరీందర్ సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి