"మసూద్ జీ" వివాదం ముదురుతోంది. కాంగ్రెస్-భాజపాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. జైష్ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్‌ను సచ్ఛీలుడుగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ పేర్కొన్నారని ఆరోపించింది. ఇందుకు సాక్ష్యంగా 2010 నాటి ఓ వీడియోను కాంగ్రెస్ విడుదల చేసింది. కాందహార్ హైజాక్ ఘటన సమయంలో ముష్కరుడు అజహర్‌ను విడుదల చేసింది భాజపాయే కదా అని విమర్శలు గుప్పించింది.
రాహుల్ గాంధీ, ముష్కర జైష్ వ్యవస్థాపకుడిని 'అజహర్ జీ' అని సంబోధించడాన్ని భాజపా తప్పుబట్టింది. ఈ విమర్శలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. రాహుల్‌గాంధీ వ్యంగంగా అన్నమాటను సైతం భాజపా తప్పుగా అభివర్ణిస్తోందని దుయ్యబట్టింది.
"మోదీ ప్రభుత్వ ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్డోభాల్, జైష్ వ్యవస్థాపకుడు అజహర్‌కు క్లీన్చిట్ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలోడోభాల్ మాట్లాడుతూ.. కాందహార్ హైజాక్ జరిగిన నేపథ్యంలో, మసూద్‌ను విడిచిపెట్టడం ఓ రాజకీయ నిర్ణయమని స్పష్టం చేశారు."-రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
ప్రధాని నరేంద్రమోదీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ జాతి విద్రోహ నిరోధక చట్టం తీసుకొస్తామంటున్నారని రణదీప్ ఎద్దేవా చేశారు. 'బీజేపీ లవ్స్ టెర్రరిస్ట్స్' అనే హ్యాష్‌టాగ్‌తో పలు ట్వీట్లు చేశారు.