తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రఫేల్​ పత్రాలపై కాంగ్రెస్​, భాజపాల మధ్య రగడ - కాంగ్రెస్

రఫేల్​ పత్రాలు మాయం కాలేదన్న అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ వ్యాఖ్యలతో కాంగ్రెస్​, భాజపా పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. రాహుల్​ గాంధీ అబద్ధాల జాతికి చెందిన వారని ట్విటర్​ వేదికగా అమిత్​షా విమర్శలు గుప్పించారు. ఏజీకి జిరాక్స్​ పత్రాలకు, చోరీకి గురైన పత్రాలకు మధ్య  తేడా తెలియట్లేదని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా ఎద్దేవా చేశారు.

రఫేల్​ పత్రాలపై కాంగ్రెస్​, భాజపాల మధ్య రగడ

By

Published : Mar 9, 2019, 6:35 AM IST

రఫేల్​ ఒప్పంద పత్రాలు చోరీకి గురయ్యాయని ఈ బుధవారమే కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. రక్షణ శాఖ నుంచి ఎటువంటి పత్రాలు చోరీకి గురికాలేదని అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ శుక్రవారం తెలిపారు. ఏజీ మాటమార్చడంపై కాంగ్రెస్​... కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించింది. కాంగ్రెస్​ అధ్యక్షులు రాహుల్​గాంధీపై కేంద్రం ఎదురుదాడికి దిగింది. ఫలితంగా ఇరుపార్టీల మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరింది.

" అబద్ధాలు చెప్పడం రాహుల్​ గాంధీకి బాగా అలవాటైపోయింది. ఈ క్రమంలో నిన్న రక్షణ శాఖ నుంచి రఫేల్​ పత్రాలు చోరీకి గురయ్యాయని పేర్కొన్నారు. కానీ రక్షణశాఖ నుంచి ఎలాంటి పత్రాలు చోరీకి గురికాలేదని ఈ రోజు స్పష్టమైంది. ప్రజల ముందుకు మరో అబద్ధాన్ని తీసుకొచ్చారు రాహుల్​" - అమిత్​ షా, భాజపా జాతీయ అధ్యక్షులు

" ప్రజాస్వామ్యంలో దేవాలయంగా భావించే పార్లమెంట్​ సాక్షిగారఫేల్​ ధర విషయంలో రాహుల్​ అబద్ధాలు చెప్పారు. ఫ్రాన్స్​ ప్రధాని, మనోహర్​ పారికర్​ సమావేశంతో పాటు ప్రతి అంశంపైనా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. "- అమిత్​ షా, భాజపా జాతీయ అధ్యక్షులు



అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ వ్యాఖ్యలపై కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా విమర్శలు చేశారు. ప్రభుత్వ అటార్నీ జనరల్​కు చోరీకి గురైన రక్షణ శాఖ పత్రాలు, నకలు పత్రాలకు తేడా తెలియకుండానే... దేశం సురక్షితచేతుల్లో ఉన్నట్లు పేర్కొన్నారని ఎద్దేవా చేశారు.

" ఒక నిజాన్ని దాచడానికి వందల అబద్ధాలు సృష్టిస్తున్నారు! నిన్న సుప్రీం కోర్టులో రఫేల్​ పత్రాలు చోరీకి గురయ్యాయని తెలిపారు. ఈ రోజు అవి నకలు పత్రాలని అంటున్నారు. " -రణ్​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

ABOUT THE AUTHOR

...view details