తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అర కోటి కరోనా కేసులనూ దేవుడి ఖాతాలోనే వేస్తారా?'

భారత్​లో కరోనా కేసులు 50 లక్షలు దాటిన నేపథ్యంలో కేంద్రంపై విమర్శలు చేసింది కాంగ్రెస్​. కరోనా వ్యాప్తి కట్టడికి మోదీ సర్కార్​ తీసుకున్న చర్యల గురించి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.

Will govt blame god to evade accountability: Cong on COVID tally topping 50 lakh
'అరకోటి కరోనా కేసులనూ దేవుడి ఖాతాలోనే వేస్తారా?'

By

Published : Sep 16, 2020, 3:51 PM IST

భారత్​లో కొవిడ్​-19 విజృంభణ కొనసాగుతూనే ఉంది. బుధవారం నాటికి కరోనా​ బాధితుల సంఖ్య 50 లక్షల మార్కును దాటింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసింది కాంగ్రెస్​. మహమ్మారిని కట్టడికి తీసుకుంటున్న చర్యల గురించి ప్రజలకు చెప్పాలని డిమాండ్​ చేసింది. కేసులను 'యాక్ట్​ ఆఫ్​ గాడ్'​ అనుకుని దేవుని ఖాతాలోనే వేస్తారా? అని ప్రశ్నించారు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా.

"కరోనా మహమ్మారి మహాభారత యుద్ధంలా ఉంది. కానీ అందులో మోదీ ప్రభుత్వ పోరాటం లేదు" అని సుర్జేవాలా ఎద్దేవా చేశారు. కరోనా గురించి ప్రధాని వాస్తవాలు చెప్పాలంటూ.. కొన్ని ప్రశ్నలు సంధించారు. వైరస్​ తీవ్రతను తెలియచేసేలా వాటికి సమాధానాలనూ పొందుపరిచారు.

  • దేశవ్యాప్తంగా రోజుకు ఎన్ని కరోనా కేసులు నమోదవుతున్నాయి?

( 90,123 కేసులతో ప్రస్తుతం భారత్​ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది)

  • కరోనా కారణంగా రోజూ మరణిస్తున్న వారి శాతమెంత?

(1290 మరణాలతో ప్రపంచంలోనే భారత్​ టాప్​-1లో కొనసాగుతోంది)

  • దేశంలో కరోనా కేసులు ఎన్ని రోజుల్లో రెట్టింపు అవుతున్నాయి?

(31 రోజుల్లో కేసులు రెట్టింపు అవుతూ.. ఈ జాబితాలో ప్రపంచంలోనే తొలిస్థానంలో భారత్​ ఉంది)

"మొత్తం కరోనా కేసుల్లో భారత్​ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. 9లక్షల 95వేల 933 యాక్టివ్​ కేసులతో ప్రపంచంలో రెండో స్థానంలోనూ.. 82,006 మరణాలతో.. ప్రపంచంలో అత్యధిక మృతుల జాబితాలో మూడో స్థానంలో భారత్​ ఉంది" అని పేర్కొంది కాంగ్రెస్.

"కరోనా కట్టడిలో వైఫల్యాన్ని దేవుడి ఖాతాలోనే వేస్తారా?" అంటూ మోదీ సర్కార్​ను నిలదీశారు సుర్జేవాలా. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, జీఎస్టీ వసూళ్లపై కరోనా ప్రభావం.. 'యాక్ట్​ ఆఫ్​ గాడ్'​ అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ ప్రశ్న వేశారు.

ఇదీ చూడండి: దేశంలో అరకోటి దాటిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details