కర్ణాటక, దిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు కొత్త అధ్యక్షుల్ని నియమించింది కాంగ్రెస్. ఆ రెండు రాష్ట్రాల్లో గట్టి ఎదురుదెబ్బలు సహా మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది.
కాంగ్రెస్ కర్ణాటక అధ్యక్షుడిగా సీనియర్ నేత డీకే శివకుమార్‌ను ఎంపిక చేసింది అధిష్ఠానం. అత్యంత సంక్షోభ పరిస్థితుల్లోనూ పార్టీకి వెన్నంటి ఉండే ఈయనను దినేశ్ గుండూ రావ్ స్థానంలో నియమించింది. ఈశ్వర్ ఖండ్రే, సతీశ్ ఝార్కిహోలి, సలీమ్ అహ్మద్‌కు కార్యనిర్వాహక అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య కర్ణాటక శాసనసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగనున్నారు.
అంతా కలిసి కాంగ్రెస్‌ను పటిష్ఠం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు శివ కుమార్.