తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశంలో అశాంతి రేపేందుకు విపక్షాల యత్నాలు' - javadekar news

జేఎన్​యూలో ఆదివారం రాత్రి విద్యార్థులు, ఆచార్యులపై దాడిని ఖండించారు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్. కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు దేశంలో అశాంతిని రేకెత్తించేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించారు.

cong-aap-left-creating-unrest-in-country-universities-javadekar
'దేశంలో అశాంతి రేపేందుకు విపక్షాల యత్నాలు'

By

Published : Jan 6, 2020, 3:54 PM IST

Updated : Jan 6, 2020, 4:01 PM IST

జవహర్​లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణపై స్పందించారు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్. విద్యార్థులు, ప్రొఫెసర్లపై దాడిని ఖండించారు. కాంగ్రెస్, ఆమ్​ఆద్మీ పార్టీలు దేశంలో.. ముఖ్యంగా విశ్వవిద్యాలయ్యాల్లో అశాంతిని రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

"గతరాత్రి జేఎన్​యూ వర్సిటీలో జరిగిన ఘర్షణను ఖండిస్తున్నా. కాంగ్రెస్, ఆమ్​ఆద్మీ, వామపక్ష పార్టీలు దేశంలో, ప్రధానంగా విశ్వవిద్యాలయాల్లో హింసను, అశాంతిని రేకెత్తించేందుకు యత్నిస్తున్నాయి. దీనిపై విచారణ జరగాలి."

-ప్రకాశ్ జావడేకర్, కేంద్రమంత్రి

ఘటన జరిగిన సమయంలో వర్సిటీ ప్రాంగణంలో కొంతమంది రాజకీయ నేతలు ఉన్నారని, వారి కుట్రతోనే ఈ ఘర్షణ చెలరేగిందని ఆరోపించారు జావడేకర్. ఘర్షణ తలెత్తిన 10 నిమిషాల్లోనే యోగేంద్ర యాదవ్ అనే నేత వర్సిటీకి చేరుకున్నారని.. ఇది గమనించాల్సిన అంశమని పేర్కొన్నారు. గత మూడు రోజులుగా వర్సిటీ కార్యకలాపాలను సజావుగా సాగనివ్వని వారెవరో గుర్తించాలన్నారు.

ఇదీ చూడండి: పౌరచట్టంపై విపక్షాలవి అబద్ధాలు: అమిత్​షా

Last Updated : Jan 6, 2020, 4:01 PM IST

ABOUT THE AUTHOR

...view details