తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​కు మోదీ.. జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు

భారత ప్రధాని మోదీ.. పాకిస్థాన్​ జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​కు లేఖ రాయడం చర్చనీయాంశమైంది.​ మోదీ ఈ లేఖ రాశారా? లేదా? అని ప్రధానమంత్రి కార్యాలయం ధ్రువీకరించాలని కాంగ్రెస్ కోరింది.

ఇమ్రాన్​ఖాన్​​కు ప్రధాని మోదీ శుభాకాంక్షల లేఖ

By

Published : Mar 23, 2019, 6:29 AM IST

Updated : Mar 23, 2019, 7:08 AM IST

పాక్​కు మోదీ.. జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు
పాకిస్థాన్​ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​కు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు.మోదీ శుభాకాంక్షలు తెలిపినట్లు పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ట్విట్టర్​ వేదికగా తెలిపారు. ఇరు దేశాలు కలిసి పనిచేయాల్సిన సమయం వచ్చిందని సందేశం అందించినట్లు ప్రకటించారు.పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వారికి శుభాకాంక్షలు తెలపటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అయితే... మోదీ 'తనకు పాక్​ జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారని' ఇమ్రాన్​ చేసిన ట్వీట్​లో ఎంత వరకు నిజముందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది పీఎంవోను ప్రశ్నించారు. మోదీ లేఖపంపారా అని ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఆరా తీసింది కాంగ్రెస్​ పార్టీ. ఇమ్రాన్​ ట్వీట్​ చేసిన సందేశం యథాతథంగా మోదీ పంపినదేనా అని ప్రశ్నించింది.

ఈ లేఖలో మోదీ... "ఉపఖండంలోని ప్రజలు ప్రజాస్వామ్య, శాంతియుత, ప్రగతిశీల, సంపన్న ప్రాంతాల కోసం కలిసి పనిచేయడానికి సమయం ఆసన్నమైందని తెలిపారు. తీవ్రవాదం, హింసాకాండ లేని వాతావరణంలో ఇరు దేశాల ప్రజలు కలిసి పనిచేయాలని సందేశం అందించారు."

భారత్​లోని పాక్​ రాయబార కార్యాలయంలో శనివారం నిర్వహించాల్సిన విందును భారత్​ బహిష్కరించింది. జమ్ముకశ్మీర్​ వేర్పాటువాదులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన కారణంగా భారత్​ ఈ నిర్ణయం తీసుకుంది.

Last Updated : Mar 23, 2019, 7:08 AM IST

ABOUT THE AUTHOR

...view details