తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భగత్​సింగ్​, రాజ్​గురు, సుఖ్​దేవ్​కు భారతరత్న ఇవ్వండి' - Bhagat singh Latest news

భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు భారతరత్న ప్రకటించాలని కాంగ్రెస్ ఎంపీ మనీష్‌ తివారీ కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. బ్రిటిష్​ పాలనలో ఎందరో దేశభక్తులకు ఈ ముగ్గురు స్ఫూర్తిగా నిలిచారని మనీష్‌ తివారీ పేర్కొన్నారు.

'భగత్​సింగ్​, రాజ్​గురు, సుఖ్​దేవ్​కు భారతరత్న ఇవ్వండి'

By

Published : Oct 26, 2019, 7:08 PM IST

Updated : Oct 26, 2019, 7:13 PM IST

స్వాతంత్ర సమరయోధులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలని.. కాంగ్రెస్ ఎంపీ మనీష్‌ తివారీ.... ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదంపై తిరుగులేని పోరాటం చేసిన ఆనాటి దేశభక్తుల్లో వారు ముగ్గురు స్ఫూర్తి నింపారని.. ఆ పోరాటంలోనే అమరులయ్యారని మనీష్‌ తివారీ గుర్తుచేశారు.

దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపుతాయి

భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ప్రజలు ఇప్పటికే ‘షహీద్‌-ఇ-ఆజం’ బిరుదుతో సత్కరించుకున్నారన్న ఆయన.. మొహాలీలోని విమానాశ్రయానికి ‘షహీద్‌-ఇ-ఆజం భగత్‌సింగ్‌’ అని నామకరణం చేశారని గుర్తుచేశారు. 2020, జనవరి 26న భారతరత్నతో వారిని గౌరవించాలని కోరిన మనీష్‌ తివారీ.. ఇలాంటి చర్యలు భారతీయులందరిలో స్ఫూర్తి నింపుతాయన్నారు. గతంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ కూడా భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు భారతరత్న ఇవ్వాలని కోరారు.

ఇదీ చూడండి : నవాజ్​ షరీఫ్​కు గుండెపోటు... ఆందోళనలో కుటుంబం!

Last Updated : Oct 26, 2019, 7:13 PM IST

ABOUT THE AUTHOR

...view details