ఉత్తరప్రదేశ్‌లో కరోనా కట్టడికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 'మూడు రోజుల ప్రణాళిక'ను అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా అధికారులే నేరుగా ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికీ యాంటిజెన్ పరీక్షలను నిర్వహించాలని ఆదేశించారు యోగి. ఈ కార్యక్రమంలో ప్రజలకు వైరస్‌పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనున్నారు.
"కొవిడ్-19, కీటకాల నుంచి సంక్రమించే వ్యాధులు, ఇతర వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి జులై 10 నుంచి 13 వరకు ప్రత్యేక పరిశుభ్రత ప్రచారం నిర్వహిస్తున్నాం. ఈ ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరికి యాంటిజెన్ పరీక్షలు చేస్తారు."