బిహార్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. నదులు ఉగ్రరూపం దాల్చడం వల్ల తోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో 14 జిల్లాల్లోని 1012 గ్రామాల్లో 45.39లక్షల మందికిపైగా ప్రభావితమయ్యారు. 11 మంది వరదల కారణంగా మృతి చెందారు.
ఇప్పటివరకు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 3.76 లక్షల మందిని ఖాళీ చేయించగా.. 26,732 మంది పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. 12 జిల్లాల్లో 21 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించినట్లు వెల్లడించారు.