మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పూ లేదు. ఈ మేరకు సోమవారం దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
వెంటిలేటర్‌పైనే ప్రణబ్: ఆర్మీ ఆస్పత్రి ప్రకటన - pranab health condition update
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. ముఖ్యమైన పారామితులు స్థిరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వెంటిలేటర్‌పైనే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు సంబంధించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై బులిటన్ విడుదల
ప్రణబ్ ముఖ్యమైన పారామితులు స్థిరంగా ఉన్నాయని.. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.
మెదడుకు సంబంధించి శస్త్రచికిత్స కోసం ఆర్మీ ఆసుపత్రిలో చేరారు ప్రణబ్. అప్పటికే ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈనెల 10న ఆపరేషన్ నిర్వహించారు.