కరోనా కట్టడి దిశగా ఆయా దేశాల ప్రభుత్వాలు తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం చాలా మందికి నష్టాన్ని మిగిల్చింది. ఉద్యోగాలపై కూడా ప్రభావం చూపింది. ఇలానే జీవనోపాధి కోల్పోయాడు శివప్రసాద్ అనే యువకుడు. కంప్యూటర్ సైన్స్ చదివిన ప్రసాద్.. అంతకు మునుపు దుబాయ్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసేవాడు. కొవిడ్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఉద్యోగం కోల్పోయాడు. భారత్‌కు తిరిగివచ్చిన తర్వాత రోడ్లపై టీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
టీ అమ్ముతూ..
ఉద్యోగం కోల్పోయిన తరువాత స్వదేశానికి తిరిగి వచ్చాడు శివప్రసాద్. తన సొంత ఊరు అయిన కర్ణాటక కడబ తాలూకాలో వేకువజాము నుంచి ఉదయం ఓ నిర్ణీత సమయం వరకు స్కూటర్‌పై టీ తీసుకువెళ్లి అమ్ముతాడు. అలా రోజుకు వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తున్నాడు.