పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులపై కేసు దాఖలైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎమ్) కోర్టులో న్యాయవాది ప్రదీప్ గుప్తా ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
సోనియా, ప్రియాంక గాంధీలపై కేసు నమోదు - తెలుగు తాజా జాతీయం వార్తలు
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేసి.. ప్రజలను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, అసదుద్దీన్ ఓవైసీ తదితరులపై కేసు నమోదైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీజేఎమ్ కోర్టులో న్యాయవాది ప్రదీప్ గుప్తా ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
![సోనియా, ప్రియాంక గాంధీలపై కేసు నమోదు Complaint filed against Sonia, Priyanka, Owaisi for giving provocative speeches against amended Citizenship Act](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5479544-389-5479544-1577187641066.jpg)
సోనియా, ప్రియాంక గాంధీలపై కేసు నమోదు
ఈ ఫిర్యాదులో ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, జర్నలిస్ట్ రవీశ్ కుమార్ పేర్లు ఉన్నాయి. ఫిర్యాదును అంగీకరించిన న్యాయస్థానం.. జనవరి 24న వాదనలు విననుంది.
ఇదీ చదవండి: ప్రస్థానం: నాడు ఎమ్మెల్యేగా ఓటమి.. నేడు రెండోసారి సీఎం!