భారత్‌కు చెందిన మూడు భూభాగాలను తమవిగా పేర్కొంటూ నేపాల్ తీసుకొచ్చిన మ్యాప్‌కు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలపడంపై భారత్ స్పందించింది. నేపాల్ ప్రభుత్వ చర్య ఎంతమాత్రం సమర్థనీయం కాదని పేర్కొంది. చారిత్రక వాస్తవాలను ఆ దేశం విస్మరించిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు.
"భారత భూభాగాలను తమవిగా పేర్కొంటూ చేసిన రాజ్యాంగ సవరణ బిల్లుకు నేపాల్ దిగువ సభ ఆమోదం తెలిపింది. మ్యాప్ విషయంలో ఇది వరకే మా వైఖరిని స్పష్టంచేశాం. చారిత్రక వాస్తవాలను, సాక్ష్యాలను విస్మరించి కృత్రిమంగా ఆ భూభాగాలను నేపాల్ తమవిగా చెప్పుకోవడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు "