తెలంగాణ

telangana

By

Published : Dec 4, 2019, 4:03 PM IST

Updated : Dec 4, 2019, 7:44 PM IST

ETV Bharat / bharat

'మూకదాడుల నివారణకు ఐపీసీ, సీఆర్​పీసీలో సవరణ'

దేశంలో మూకదాడుల నివారణకై భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ), కోడ్​ ఆఫ్​ క్రిమినల్​ ప్రోసీజర్​ (సీఆర్​పీసీ)లో అవసరమైన సవరణలు సూచించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. ప్రత్యేక చట్టం తేవాలని రాజ్యసభలో పలువురు సభ్యులు డిమాండ్​ చేసిన నేపథ్యంలో ఈమేరకు వివరణ ఇచ్చారు షా.

mob lynching
కేంద్ర హోంమంత్రి అమిత్​ షా

'మూకదాడుల నివారణకు ఐపీసీ, సీఆర్​పీసీలో సవరణ'

దేశంలో మూకదాడులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ), కోడ్​ ఆఫ్​ క్రిమినల్​ ప్రోసీజర్​ (సీఆర్​పీసీ)లో అవసరమైన మార్పులపై సూచనలు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో మూక దాడులపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు షా.

"ఐపీసీ, సీఆర్​పీసీలో మార్పుల కోసం తగిన సూచనలు చేయాలని నేనే స్వయంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, గవర్నర్లకు లేఖ రాశాను. ఆయా రాష్ట్రాల్లోని అనుభవజ్ఞులైన దర్యాప్తు అధికారులు, పబ్లిక్​ ప్రాసిక్యూటర్ల​ సలహాలు, సూచనలు తీసుకున్నాక మాకు పంపాలని సూచించాం. ఐపీసీ, సీఆర్​పీసీలో మార్పుల కోసం బీపీఆర్ అండ్ డీ కింద ఓ కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీ సిఫార్సుల మేరకు సవరణలు చేసేందుకు పని ప్రారంభిస్తాం. ఇందులో సుప్రీం కోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుంటాం."

- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.

మూక దాడులకు ఐపీసీలో ప్రత్యేక నిర్వచనం ఏదీ లేదని.. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్​ 300, 302 కిందనే నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్​. మూక దాడులపై రాజస్థాన్​, మణిపుర్​ రాష్ట్రాలు ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చాయని.. ప్రస్తుతం కేంద్రం ఆమోదం కోసం పంపినట్లు వివరించారు.

ఇదీ చూడండి: ఐదుగురు సహచరుల్ని బలిగొన్న జవాన్- ఎందుకు?

Last Updated : Dec 4, 2019, 7:44 PM IST

ABOUT THE AUTHOR

...view details