ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలతో విరుచుకుపడింది కాంగ్రెస్. 'ఓం, ఆవు పదాలు చెబితే విపక్షాలకు దడ' అని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ స్పందించారు. ఓం, ఆవు పదాల గురించే మాట్లాడి.. ఆర్థిక వ్యవస్థ మందగమనంపై నోరుమెదపకుండా ప్రజల్ని మోదీ దారిమళ్లిస్తున్నారని విమర్శించారు. ఓం, ఆవు పదాల వల్ల దేశంలో ఎవరకీ సమస్య లేదని తాము భావిస్తున్నట్లు తెలిపారు సింఘ్వీ. ఆర్థిక వ్యవస్థ స్థితి, గణాంకాలపై ప్రధాని మాట్లాడకపోవడమే తమ సమస్య అన్నారు. వాగ్ధాటి అయిన మోదీ వీటిపై స్పందించాలన్నారు.
'ఆవుల గురించి కాదు ఆర్థిక వ్యవస్థపై మాట్లాడండి' - cows
కేవలం ఆవు, ఓం పదాల గురించే కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా మాట్లాడాలని ప్రధాని నరేంద్ర మోదీపై ధ్వజమెత్తింది కాంగ్రెస్. ప్రజలను తప్పుదోవ పట్టించకుండా వాస్తవ సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించింది.
'ఆవుల గురించి కాదు ఆర్థిక వ్యవస్థపై మాట్లాడండి'
ఉత్తర్ప్రదేశ్ మథురాలో పశువుల్లో వ్యాధులను అరికట్టేందుకు ఉద్దేశించిన కార్యక్రమంలో బుధవారం పాల్గొన్నారు మోదీ. ఈ కార్యక్రమంలో విపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓం, ఆవు పేర్లు చెబితే వారు ఉలిక్కిపడుతున్నారని విమర్శించారు.
ఇదీ చూడండి: జయలలిత స్మారకం సాక్షిగా ఒక్కటైన నవజంట
Last Updated : Sep 30, 2019, 7:25 AM IST