మదర్ థెరిసా 110వ జయంతి సందర్భంగా ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ. తన తండ్రి రాజీవ్ గాంధీ హత్య అనంతరం థెరిసా తమను కలిసినట్లు చెప్పారు. ఆ సందర్భంగా తనతో కలిసి పనిచేసేందుకు రావాలని థెరిసా పిలుపునిచ్చినట్లు ప్రియాంక వెల్లడించారు.
ఛారిటీ సభ్యులతో కలిసి రోగులకు సాయం చేస్తున్నప్పటి పాత ఫొటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ ఈ విషయం చెప్పారు ప్రియాంక.
"మా నాన్న చనిపోయిన కొద్దిరోజుల తర్వాత మదర్ థెరిసా మమ్మల్ని చూడటానికి వచ్చారు. అప్పుడు నాకు జ్వరం వచ్చింది. ఆమె నా పక్కన కూర్చొని చేయి పట్టుకొని తనతో పాటు రావాలని పిలిచారు. తర్వాత చాలా సంవత్సరాలు సేవ చేశాను. నిస్వార్థ సేవ, ఆప్యాయతలు చూపిస్తున్న ఛారిటీ సిస్టర్స్‌లో గొప్ప స్నేహభావాన్ని చాటిన థెరిసాకు కృతజ్ఞతలు."
-ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి