దేశ రాజధాని దిల్లీలో 71ఏళ్ల తరువాత ఈ నవంబర్లో సగటు కనిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెలకు గాను సగటు అత్యల్ప ఉష్ణోగ్రత 10.2 డిగ్రీలుగా నమోదైనట్లు పేర్కొంది. 1949లో కూడా ఇలాంటి గణాకాలే నమోదు చేసినట్లు స్పష్టం చేసింది ఐఎండీ.
సాధారణంగా నవంబర్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 1938 నవంబర్లో దిల్లీలో సగటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు అత్యల్పంగా 9.6 డిగ్రీలకు పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేవలం నవంబర్ నెలకు గాను దిల్లీలో సగటు అత్యల్ప ఉష్ణోగ్రతలు.. గత ఏడాది 15 డిగ్రీలు, 2018లో 13.4 డిగ్రీలు, 2017,16ల్లో 12.8 డిగ్రీలుగా నమోదయ్యాయి.
ఈ ఏడాది నవంబర్లో నాలుగు సార్లు కోల్డ్ వేవ్(శీతల గాలులు వీయడం) కొనసాగిందని ఐఎండీ తెలిపింది.