తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగ్రవాదుల ఏరివేతలో అశుతోష్ 'శౌర్య' ప్రతాపం

ఉగ్రవాదులను ఏరివేయడంలో దిట్ట. ఎదురుగా ఎంతమంది శత్రువులు ఉన్నా భయమనేది ఉండదు. ముష్కరుల దాడుల్లో ఎంతో మందిని సైనికులను కాపాడారు. అతడి ధైర్య సాహసాలకు మెచ్చి కేంద్రం 2 సార్లు ప్రతిష్టాత్మక 'శౌర్య' పతకాలను అందించింది. ఆయనే శనివారం జమ్ముకశ్మీర్​ హంద్వారాలో ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందిన కల్నల్​ అశుతోష్ శర్మ.

Col killed in Handwara was a two-time gallantry awardee for counter-terrorist operations
ఉగ్రవాదుల ఏరివేతలో కల్నల్​ అశుతోష్ 'శౌర్య' ప్రతాపం

By

Published : May 3, 2020, 2:59 PM IST

జమ్ముకశ్మీర్ హంద్వారాలో శనివారం రాత్రి జరిగిన ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందిన కల్నల్​ అశుతోష్ శర్మ సాహసమే ఊపిరిగా బతికారు. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో ఆయన చూపిన పరాక్రమం అసామాన్యం. అందుకే ఆయన నిబద్ధతను మెచ్చి శౌర్య, సేన పతకాలను అందజేసింది కేంద్రం.

కల్నల్​ అశుతోష్​ శర్మ 21వ రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్​లో విధులు నిర్వహించేవారు. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో ప్రదర్శించిన ధైర్య సాహసాల​కు గాను రెండు సార్లు శౌర్య పతకాన్ని అందుకున్నారు శర్మ. ఉగ్రవాదులు తప్పించుకునేటప్పుడు వారిపై చేతి బాంబులు విసిరి వారిని నిరోధించారు. ఎన్​కౌంటర్​ సమయాల్లో జమ్ముకశ్మీర్​ పోలీస్ సిబ్బందితో పాటు ఎంతో మంది సైనికుల ప్రాణాలను కాపాడారు కల్నల్​.

గత ఐదేళ్లలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్​కౌంటర్​లో చనిపోయిన కల్నల్​ స్థాయి సైనికాధికారి కల్నల్​ ఒక్కరే. సరిగ్గా ఐదేళ్ల కితం 2015 జనవరిలో కల్నల్​ ఎంఎన్​ రాయ్​ ఎన్​కౌంటర్​లో చనిపోగా.. అదే ఏడాది నవంబర్​లో కల్నల్​ సంతోష్​ మహాధిక్​ వీర మరణం పొందారు.

గార్డ్స్ రెజిమెంట్‌కు చెందిన కల్నల్ అశుతోష్ శర్మ చాలా కాలంగా కశ్మీర్ లోయలో సేవలందిస్తున్నారు. కమాండింగ్ అధికారిగా తాను ప్రదర్శించిన ధైర్యసాహసాలకు గాను రెండు సార్లు 'సేన' పతకాన్ని అందుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details