తెలంగాణ

telangana

ఇంటికెళ్లాలన్న ఆశ సరే... జాగ్రత్తలేవి?

By

Published : May 20, 2020, 12:29 PM IST

లాక్​డౌన్ నిబంధనలకు తూట్లు పొడుస్తూ వందలాది మంది వలస కార్మికులు ఒకే చోట గుమిగూడిన ఘటన తమిళనాడు కోయంబత్తూరులో జరిగింది. వీరంతా తమ స్వస్థలాలకు చేరేందుకు రైళ్ల పాసులు తీసుకునేందుకు వచ్చినవారే.

Coimbatore
భౌతికదూరం, మాస్కులు ఎక్కడ?

ఓ వైపు కరోనా వ్యాప్తి విపరీతంగా పెరుగుతున్నా... వందలాది మంది వలసకూలీలు ఒకే చోట గుమిగూడిన ఘటన తమిళనాడు కోయంబత్తూరులోని సుందరపురంలో చోటుచేసుకుంది. వీరంతా తమ స్వస్థలాలకు వెళ్లేందుకు.. శ్రామిక్​ ప్రత్యేక రైళ్లలో ప్రయాణానికి అనుమతి లభిస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నవారే.

భౌతికదూరం, మాస్కులు ఎక్కడ?

వలసకూలీల్లో చాలా మంది మాస్కులు ధరించలేదు. పాసుల కోసం వరుసలో నిల్చున్నప్పుడు భౌతిక దూరం పాటించలేదు.

ఒకే చోట గుమిగూడిన వందలాది వలసకార్మికులు
కోయంబత్తూరులో గుమిగూడిన వలసకార్మికుల
రైల్వే పాసుల కోసం ఎదురు చూస్తున్న మహిళ
రైలు పాసుల కోసం నిరీక్షిస్తున్న వలసకూలీలు

సొంతగూటికి 21 లక్షల మంది ..

కరోనా సంక్షోభం, లాక్​డౌన్ కారణంగా వలసకూలీలు, కార్మికులు, విద్యార్థులు, పర్యటకులు... ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్నారు. వీరు స్వస్థలాలు చేరుకునేందుకు పడుతున్న అగచాట్లను గమనించిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను నడపాలని భారతీయ రైల్వేను ఆదేశించింది.

ఫలితంగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా.. 1,595 శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ద్వారా 21 లక్షల మంది వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరుకున్నారని భారతీయ రైల్వే ప్రకటించింది.

ఇదీ చూడండి:కరోనా రికార్డ్​: 24 గంటల్లో 5,611 కేసులు, 140 మరణాలు

ABOUT THE AUTHOR

...view details