తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో 3 రోజుల్లో ఉరిశిక్ష... సుప్రీం స్టేతో తాత్కాలిక ఊరట - మరణశిక్ష అమలుపై స్టే

9 ఏళ్ల నాటి కేసు. దోషికి మరణశిక్ష పడింది. ఉరి తీయడానికి సెప్టెంబర్​ 20 ముహూర్తం. 3 రోజుల ముందు కీలక నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు. మరణశిక్ష అమలుపై స్టే విధించింది. ఇంతకీ ఎవరా దోషి? ఏంటా కేసు?

మరో 3 రోజుల్లో ఉరిశిక్ష... సుప్రీం స్టేతో తాత్కాలిక ఊరట

By

Published : Sep 17, 2019, 6:12 PM IST

Updated : Sep 30, 2019, 11:19 PM IST

కోయంబత్తూరులో జరిగిన అత్యాచారం, జంట హత్యల కేసు దోషికి అక్టోబరు 16 వరకు ఉరిశిక్షను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆగస్టు 1న ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని పరిగణనలోకి తీసుకుని... ఈమేరకు ఆదేశాలిచ్చింది.

దోషి మనోహరన్​కు ఈనెల 20న మరణశిక్ష అమలు చేయాల్సి ఉంది.

9 ఏళ్ల క్రితం మనోహరన్​ ఓ బాలికను అత్యాచారం చేశాడు. ఆమెను, ఆమె సోదరుడ్ని హత్యచేశాడు. విచారణ న్యాయస్థానం మనోహరన్​కు మరణశిక్ష విధించింది. ఆగస్టు 1న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం 2:1 మెజార్టీతో ఆ శిక్షను ఖరారు చేసింది.

అయితే... తీర్పును సమీక్షించాలంటూ దోషి తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో మరో వ్యాజ్యం వేశారు. విచారణ కోర్టులో ఉన్న రికార్డులను పరిశీలించాల్సి ఉందని, అందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం... మరణశిక్ష అమలుపై అక్టోబర్ 16 వరకు స్టే విధించింది. ఇదే ఆఖరి అవకాశమని మనోహరన్ తరఫు న్యాయవాదికి స్పష్టంచేసింది.

Last Updated : Sep 30, 2019, 11:19 PM IST

ABOUT THE AUTHOR

...view details