కరోనాపై పోరులో భారత్కు రూ.100 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకువచ్చింది కోకాకోలా. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో పేదలకు వైద్య సదుపాయం, నీటి వసతి కల్పించేందుకు ఈ నిధులను వినియోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పింది.
యునైటెడ్ వే, కేర్ ఇండియా సామాజిక సంస్థలతో కలసి ఆరోగ్య, ఆహార భద్రత దిశగా భారత్లో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ దిశగా ఇప్పటికే అక్షయపాత్ర ఫౌండేషన్, వనరయి, చింతన్, హసిరుదలా, మంతన్ సంస్థాన్, అమెరికన్ ఇండియా ఫౌండేషన్లతో కలిసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు స్పష్టం చేసింది. ఇందులో భాగంగా పేదలకు ఆహారం, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు, కరోనా రక్షణ సామగ్రి, ఔషధాలు అందిస్తున్నట్లు తెలిపింది.