కర్ణాటక శివమొగ్గ జిల్లా భద్రావతిలో సోను నివాసం ఉంటున్నాడు. అతను పాములు పట్టడంలో నిపుణుడు. అదే గ్రామంలో ఒకరింటిలో పాము కనిపించింది. దానిని పట్టుకునేందుకు సోనును పిలిచారు.
తాగిన మత్తులో నాగుపాముకు ముద్దు ఇచ్చాడు.. తర్వాత ఏమైంది? - karnataka news
తాగిన మత్తులో నాగుపాముకు ముద్దివ్వాలని ప్రయత్నించి ప్రాణాలపైకి తెచ్చుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. స్నేహితుల ముందు తన ప్రతిభను ప్రదర్శించబోయి ప్రమాదంలో పడ్డాడు.
నాగుపాముకు ముద్దిచ్చాడు
అయితే అప్పటికే తాగి ఉన్నాడు సోను. పాము కనిపించగానే దానిని ముద్దు పెట్టుకుంటాను చూడండంటూ తన స్నేహితులకు గొప్పలు చెప్పాడు. పామును సోను ముద్దు పెట్టుకుంటుండగా.. అది భయంతో అతని పెదవిని కొరికేసింది.
పెదవి నుంచి రక్తం కారుతుండటం వల్ల స్థానికులు తాలూకా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శివమొగ్గలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు సోను.
Last Updated : Dec 25, 2019, 3:46 PM IST