కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేను బొగ్గు కుంభకోణం కేసులో దోషిగా తేలుస్తూ ఝార్ఖండ్ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. 1999లో ఝార్ఖండ్‌లో బొగ్గు బ్లాక్‌లను కేటాయించడంలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై ఈ మేరకు కోర్టు తీర్పు వెలువరించింది. వాజ్‌పేయీ హయాంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా దిలీప్ రే పనిచేశారు.
బొగ్గు కుంభకోణంలో దోషిగా కేంద్ర మాజీ మంత్రి - Former Union minister Dilip Ray was convicted coal scam case
బొగ్గు బ్లాక్‌ను కేటాయించడంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రే దోషిగా తేలారు. ఆయనతో పాటు బొగ్గు శాఖలో పనిచేసిన అధికారులను ఝార్ఖండ్‌లోని ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా తేల్చింది.
![బొగ్గు కుంభకోణంలో దోషిగా కేంద్ర మాజీ మంత్రి Coal scam: Court convicts ex-Minister Dilip Ray, others](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9066942-651-9066942-1601963547260.jpg)
బొగ్గు కుంభకోణంలో దోషిగా కేంద్ర మాజీ మంత్రి
దిలీప్‌తో పాటు కుంభకోణం జరిగిన సమయంలో బొగ్గు గనుల మంత్రిత్వ శాఖలో పనిచేసిన ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యానంద్ గౌతమ్, కాస్ట్రోన్ టెక్నాలజీస్ లిమిటెడ్‌తో పాటు ఆ సంస్థ డైరెక్టర్ మహేంద్ర కుమార్ అగర్వాలా, కాస్ట్రోన్ మైనింగ్ లిమిటెడ్‌లను దోషులుగా తేల్చుతూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పరాషార్ ఈ మేరకు తీర్పు వెలువరించారు.
దోషులకు శిక్ష విధింపుపై అక్టోబర్ 14న వాదనలు జరగనున్నాయి.